బాసరకు పోటెత్తిన భక్తజనం..
బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : చల్లపల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి క్షేత్రానికి భక్తజనం పోటెత్తారు. శుక్రవారం పంచమి కలిసి రావడంతో అమ్మవారిని దర్శ తమ చిన్నారులకు అక్షరభ్యాస పూజలు జరిపించేందుకు అమ్మవారి క్షేత్రానికి భక్తులు క్యూ కట్టారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణాలు సందడిగా మారాయి. భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నది తీరాన గల శివాలయంలో ప్రత్యేక అభిషేక అర్చన పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గోదారమ్మకు తె ప్పలు వదిలి పూజలు చేశారు. ఆలయంలోని అమ్మవార్లను భక్తులు దర్శించుకుని తమ చిన్నారులకు ఆలయ అర్చకులచే అక్షరాభ్యాస పూజలు జరిపించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
