క‌ళ్ల‌కు నల్ల గుడ్డలు కట్టుకొని..

క‌ళ్ల‌కు నల్ల గుడ్డలు కట్టుకొని..

ఐకెపీ వీఓఏల నిరసన

దండేపల్లి, మే 23 (ఆంధ్రప్రభ): తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని ఐకేపీ (ఇందిరా క్రాంతిపథం), సెర్ప్‌ (గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ) వీఓఏలు సమ్మె ప్రారంభించారు ఈ నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత పద్ధతిలో నిరవధిక సమ్మె చేపట్టాలని ‘తెలంగాణ రాష్ట్ర ఐకేపీ, సెర్ప్‌ వీఓఏల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ’ నిర్ణయించింది. ఈ మేరకు దండేపల్లి మండల ఐకెపి విఓఏ ల ఆధ్వర్యంలో దండేపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో సమ్మెను నిర్వహిస్తున్నారు శనివారం వి ఓ ఎ లు తమ కండ్లకు నల్ల గుంతలు ధరించి విన్నూత నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఐకెపి విఓఏ ల యూనియన్ మండల అధ్యక్షుడు బద్రి సత్తన్న మాట్లాడుతూ,పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు న్యాయం జరిగేలా సూచి కనీస వేతనం నెలకు 20వేలు చెల్లించాలని, తమను సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించి, హెచ్‌ఆర్‌ పాలసీని వర్తింపజేయాలని, 10 లక్షల ప్రమాద, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించి అర్హులైన విఓఏ లకు సిసి లు పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో ,గౌరవ అధ్యక్షుడు, కొప్పుల లింగయ్య, ఉపాధ్యక్షులు ముత్యం శ్రీనివాస్,సలహా దారులు, బొలిశెట్టి అనంత లక్ష్మీ, మహేష్, భులక్ష్మీ, నీరజ అడే సుజాత విజయ,రవి రజిత,మంగ, సరిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply