Development | అందుబాటులో ఉంటూ సేవ చేయాలి…

Development | అందుబాటులో ఉంటూ సేవ చేయాలి…

Development | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజలు ఎంతో నమ్మకంతో గ్రామాభివృద్ధి కోసం గెలిపించిన నూతన సర్పంచులు నిరంతరం గ్రామాల్లో అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఊట్కూర్ తాహసిల్దార్ చింత రవి అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ తాహసిల్దార్ రవిని మల్లేపల్లి, కొల్లూరు సర్పంచులు నూతనంగా గెలుపొందడంతో తాహసిల్దార్ ను కలువగా వారిని సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా తాహసిల్దార్ మాట్లాడుతూ… అభివృద్ధికి సర్పంచ్ ల బాధ్యత కీలకమని బాధ్యతాయుతంగా పనులు చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధి(Development)కి తమ వంతు సహకారం ఉంటుందని నూతన పాలకవర్గం కలిసికట్టుగా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. గ్రామాల ప్రజలకు సేవ చేసే అవకాశం దేవుడు ఇచ్చిన గొప్ప వరమని అన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు(welfare schemes) పారదర్శకంగా అమలు చేయడంతో పాటు నిరంతరం ప్రజల మధ్య ఉండడం వారి ద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్లేపల్లి సర్పంచ్ కతలప్ప, కొల్లూరు సర్పంచ్ సువర్ణ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్రా రెడ్డి, ఆర్ ఐ కృష్ణారెడ్డి, నాయకులు సమృద్ధి, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply