Kalvakuntla Kavitha | త్రిబుల్ ఆర్ రైతుల కోసం పోరాడుదాం

Kalvakuntla Kavitha | త్రిబుల్ ఆర్ రైతుల కోసం పోరాడుదాం

  • జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha | ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : త్రిపుల్ ఆర్ రైతుల సమస్యల పరిస్కారం కోసం కలసి ఉద్యమిద్దామని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు. ఇవాళ‌ యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో బాగంగా రాయిగిరి రైతులతో మాట్లాడారు. బీబీ నగర్‌లోని ఎయిమ్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారులను వివరంగా అడిగి తెలుసుకున్నారు.

Kalvakuntla Kavitha

వైద్య సదుపాయాలు, చికిత్స విధానాలు, రోగులకు అందిస్తున్న సేవల నాణ్యతపై కవిత ప్రత్యేక దృష్టి సారించారు. ఎయిమ్స్‌ సందర్శనకు వచ్చిన పాఠశాల విద్యార్థులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కాసేపు మాట్లాడారు. ఎయిమ్స్ బిల్డింగ్ మోడల్‌ను చూపిస్తూ జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను వైద్య అధికారులు వివరించారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఎయిమ్స్ కీలకంగా మారుతుందన్నారు.

Kalvakuntla Kavitha

CLICK HERE TO READ గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా

CLICK HERE TO READ MORE

Leave a Reply