చిన్నకపర్తి లో డే డ్రై ఫ్రైడే కార్యక్రమం

చిన్నకపర్తి లో డే డ్రై ఫ్రైడే కార్యక్రమం
మురుగునీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి
దోమల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలి
సర్పంచ్ ఆవుల సుందర్
చిట్యాల, ఆంధ్రప్రభ : గ్రామంలో మురుగునీరు నిలవకుండా ముందస్తు జాగ్రత్త లు పాటించాలని పాటించని యెడల దోమల పాడిన పడి అనారోగ్యానికి గురవుతామని సర్పంచ్ ఆవుల సుందర్ తెలిపారు. శుక్రవారం నాడు మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో డే డ్రై ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆవుల సుందర్ మాట్లాడుతూ ప్రజలకు నీరు నిలువ ఉండటం వలన దోమలు తయారై వాటి వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించారు.
ప్రతి శుక్రవారం ప్రతి ఒక్కరూ ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బెల్లంకొండ లావణ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, వార్డు సభ్యులు దయాకర్, మధు నరసింహ, నాగరాజు, ప్రశాంత్ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
