అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నిధులు విడుదల

అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నిధులు విడుదల

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉరవకొండ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నియోజకవర్గ ప్రత్యేక అధికారిణి పద్మలత హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కింద, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతుల ఖాతాలోకి నగదు జమ చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉరవకొండ వ్యవసాయ సహాయ సంచాలకులు సత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న, వ్యవసాయ మరియు అనుబంధ రంగాల సంబంధిత పథకాలు గురించి వివరించారు.

గ్లోబల్ ఉద్యాన హబ్, 90 శాతం సబ్సిడీపై బిందు సేద్యం, కోకోసిటీ, ఉద్యాన రైతులకు, ఉజ్వల భవిత, పొలం పిలుస్తోంది, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ, ఆయిల్ పాంతో అధిక ఆదాయం, నల్లబర్లి పొగాకు రైతులకు చేయూత, ఉల్లి మామిడి, కోకో రైతులకు అండ, ధాన్యం కొనుగోలు, పంటల సాగులో డిజిటల్ సేవలు, పాడి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం, ఆక్వా రైతులకు, విద్యుత్ రాయితీ గురించి తెలిపారు. ఉరవకొండ నియోజకవర్గ పరిధిలో 47, 680 రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద 19.08 కోట్లు, పిఎం కిసాన్ క్రింద 9.24 కోట్లు మొత్తం కలిపి 28.32 కోట్లు రూపాయలను మూడవ విడత కింద రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయ భాస్కర్, బిజెపి నాయకులు లక్ష్మీనారాయణ, టిడిపి నాయకులు తిమ్మప్ప, షేక్ షాన్ పల్లి రఘు రాములు, సిద్ధప్ప, మోపిడి గోవిందు, ప్యారం కేశవానంద, ఇంద్రావతి వెంకటేశులు, సుంకరత్నమ్మ, వరప్రసాద్, నిరంజన్ గౌడ్, నాగేశ్వరరావు, కుళ్లాయప్ప, ఏఈవో లు భరత్ రాజ్, వెంకట నారాయణ, శిరీష్ కుమార్, రామన్న, ప్రియాంక వ్యవసాయ విస్తరణ అధికారులు ఆత్మ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply