Durgi | ప్రజలకు మేమున్నాం..

Durgi | ప్రజలకు మేమున్నాం..
- శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా భరోసా!
- డీఎస్పీ జగదీష్
- పోలేపల్లి గ్రామంలో కార్డెన్ సెర్చ్
Durgi | దుర్గి, ఆంధ్రప్రభ : శాంతి భద్రతల పరిరక్షణలోభాగంగా ప్రజలకు అండగా మేమున్నామని పోలీస్ డిపార్ట్మెంట్ భరోసా ఇచ్చింది. పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం గురజాల సబ్ డివిజన్ దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామమైన పోలేపల్లి గ్రామంలో గురజాల డీఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో కారంపూడి సబ్ డివిజన్ దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలేపల్లి గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా గ్రామంలో ఇంటింటికీ తిరిగి మరణాయుధాలను సేకరించారు. ఈ తనిఖీలలో గ్రామంలో సరైన పత్రాలు లేని ద్విచక్రవాహనాలు-34, కొడవళ్ళు09, ఇనుపరాడ్లు -06, గడ్డపలుగులు – 11, గొడ్డళ్లు – 13, బరిసెలు – 03, నాటుకర్రలు05 స్వాధీనం చేసుకున్నారు
