జనన గణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

జనన గణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
- నగర కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, ఆంధ్రప్రభ: దేశాభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికల కోసం అత్యంత కీలకమైన జన గణన 2027 ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని శ్యామల నగర్ 9వ లైన్‌లో కమిషనర్ స్వయంగా పర్యటించి, పలు ఇళ్లలో ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రత్యక్షంగా నిర్వహించారు.
నగరవ్యాప్తంగా మిగిలి ఉన్న ఇళ్ల గణనను రాబోయే 2 రోజుల్లో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్యూమరేటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంక్ వివరాలు, పిన్ లేదా ఓటీపీ అడగరనీ కమిషనర్ సూచించారు. ఒక్కో ఇంటికి కేవలం 2 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని, ఖచ్చితమైన వివరాలు అందించి ప్రభుత్వానికి సహకరించాలని కమిషనర్ కోరారు. జన గణనపై సందేహాలకు జిఎంసి కాల్ సెంటర్ 📞 0863-2345105 (ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు) పనిచేస్తుందని కమిషనర్ తెలిపారు.
