జిల్లా జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన అదనపు కలెక్టర్, అదనపు ఎస్పీ

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జె. జీవన్ కుమార్‌ను జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్ కుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన జిల్లా ప్రధాన న్యాయమూర్తికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలకు సమర్థవంతమైన న్యాయ సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ పలు అంశాలపై వారు చర్చించారు.