నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్
- సీఐ మల్లేష్
టేకుమట్ల, ఆంధ్రప్రభ: నేరాల నియంత్రణ, శాంతిభద్రతలు, ప్రజారక్షణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని సీఐ మల్లేష్ అన్నారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ద్వారకపేట గ్రామంలో టేకుమట్ల ఎస్ఐ అమూల్య ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో సోదాలు చేపట్టి, సరైన పత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సీఐ మల్లేష్ మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.యువత సత్ప్రవర్తన కలిగి మంచి పౌరులుగా ఎదగాలని, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ కోసం పోలీసులు అన్నివేళలా కృషి చేస్తారని పేర్కొన్నారు. నేర రహిత సమాజం, ప్రజా శ్రేయస్సు కోసం ప్రజలు, యువత పోలీసులకు సహకరించాలని సీఐ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కళ రవి, గ్రామస్తులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
