వలిగొండ ప్యాక్స్ నూతన కమిటీ.. 13 మంది సభ్యులతో ప్రభుత్వం ఉత్తర్వులు

వలిగొండ (ఆంధ్రప్రభ): యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS)కు ప్రభుత్వం నూతన కమిటీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. సురేంద్రమోహన్ జి.ఓ.ఆర్.టి. నెం.401ను జారీ చేశారు. సహకార శాఖ ప్రత్యేక కమిషనర్, రిజిస్ట్రార్ తదుపరి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పర్సన్-ఇన్-చార్జి కమిటీ అధ్యక్షుడిగా మల్లెపల్లి గ్రామానికి చెందిన గరిసే రవిని నియమించగా, మరో 12 మందిని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.

ఈ కమిటీ ఈ నెల 16న వలిగొండ PACS కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనుంది. సభ్యులుగా జక్కా జంగారెడ్డి, బత్తిని లింగమ్మ, ఎం. మల్లేశం, కట్టా లింగస్వామి, బుడిద పద్మ, కల్కూరి చంద్రయ్య, బర్ల నర్సింహ, గూడూరు మోహన్‌రెడ్డి, వనగంటి జహంగీర్, బుగ్గ బీరప్ప, వనం నర్సింహ, బంగారి మహిపాల్‌లను నియమించారు. కాగా, మండలంలోని మరో సహకార సంఘమైన ఆరూరు PACS‌కు చైర్మన్ నియామకం ఇంకా పెండింగ్‌లో ఉంది. ఆ పదవికి పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.