లేబర్ కోడ్స్ రూల్స్ ప్రతులు దగ్ధం

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ ; 4 లేబర్ కోడ్స్ రూల్స్ ప్రతులను ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) ఆధ్వర్యంలో నిరసన తెలుపు తూ దగ్ధం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తొర్రూర్ బస్టాండ్ ఎదురుగా మోడీ ప్రభు త్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ప్రతులను దయ్యం చేసినట్లు జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి చెప్పారు.

అనంతరం ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడు తూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ను తెచ్చి ఏప్రిల్ ఒకటవ తారీకు నుండి అమలుకు పూను కున్నదని అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేబర్ కోడ్స్ ను అమలు చేయొద్దనీ డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో రాష్ట్రంలో లేబర్ కోడ్స్ అమలు చేయకుండా తీర్మానం చేయాలన్నారు.

పారిశ్రామిక సంబంధాల కోడ్,వేతన కోడ్ సామాజిక భద్రత కోడ్ ,వృత్తిపర మైన భద్రత ఆరోగ్యం పని పరిస్థి తుల కోడ్ ఈ నాలుగు లేబర్ కోడ్ లు, తీవ్రమైన నష్టదాయకమనీ అన్నారు. వీటితో కార్మిక సంఘం ఏర్పాటు చేసుకునే హక్కును లేకుండా చేస్తుంద న్నారు. మహిళలను రాత్రి వేళలో పనిచేసుకునేందుకుఅవకాశం కలిపిస్తుందన్నారు.

భవన నిర్మాణంలో ఎక్కువ మంది మహిళాలే ఉన్నందున వారి భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉన్నదిలాంటి కార్పొరేట్ సంస్థల అధిపతు లు72 నుంచి 90 గంటలు అంటే 12 నుంచి 14 గం.ల పాటుపనులు చేయాలని ప్రకటనల ప్రభావంతో భవన నిర్మాణ రంగంలో పనిగంటలు పెరిగే ప్రమాదమున్నద న్నారు.

ఈ కోడ్ లను ఏప్రిల్ ఒకటి నుండి లేబర్ కోడ్స్ ను అమలు చేసేందుకు మోడీ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందన్నా రు.2020 లో కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కొత్తగా నాలుగు లేబర్ కోడ్ ల ను, రూపొందించిం దనివీటిని దేశవ్యాప్తంగా కార్మికులు కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని వారన్నా రు.ఈకార్యక్రమంలో తొర్రూర్ ఏరియా అధ్యక్షులు శ్రీరాం పుల్లయ్య, కార్యదర్శి ఎండీ షరీఫ్ నాయకులు అర్వపల్లి వెంకన్న, మురళి, సోమనర్స య్య,యాక య్య,వెంకన్న, వెంకన్న, యకమ్మ, లక్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply