Kesamudram | వేం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక‌లు

Kesamudram | వేం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక‌లు

కేసముద్రం, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామ సర్పంచ్ ఎదరబోయిన సూరయ్య శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలో చేరగా, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

జిల్లా కాంగ్రెస్ నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నీలం దుర్గేశ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కల్వల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్ సమక్షంలో సూరయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా సూరయ్య మాట్లాడుతూ.. కేసముద్రం మండలంతో పాటు మున్సిపాలిటీ పరిధిలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి వందల కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తనను ఆకర్షించాయని చెప్పారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు తెలిపారు.

రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందుతోందని, గ్రామస్థాయిలో నాయకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరడం ఇందుకు నిదర్శనమని అన్నారు. సూరయ్య పార్టీలో చేరడం వల్ల గ్రామంలో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు గూగులోత్ దస్రు నాయక్, మాజీ ఉప సర్పంచ్ భానోత్ చిన్న వెంకన్న, కాట్రపల్లి ఉప సర్పంచ్ సాగంటి యాదగిరి, మాజీ ఉప సర్పంచ్ రఫీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply