మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు సాకారం కావాలి..

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు సాకారం కావాలి..

మున్సిపల్ చైర్మన్ శ్రవణ్ కుమార్

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు సాకారం కావాలి మున్సిపల్ చైర్మన్ శ్రవణ్ కుమార్ అన్నారు . శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ తదితరులు ఘన పుష్పాంజలి సమర్పించారు. సామాజిక అసమానతలు, కుల వివక్ష, అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి సమాజంలో సమానత్వం వెలుగులు నింపేందుకు తన సంపూర్ణ జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే మహిళల విద్యకు నాంది పలికి, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడి, ప్రతి మనిషికి సమాన అవకాశాలు ఉండాలనే మహోన్నత భావనను సమాజంలో నాటిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన.

విద్య ద్వారా సమాజాన్ని మార్చవచ్చని ఆయన చూపిన మార్గం ఈ రోజుకీ మనకు దిక్సూచి అని ,జయంతి సందర్భంగా, దళితులు, మహిళలు మరియు పీడిత వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను మన జీవితాల్లో ఆచరణలో పెట్టాలని మనమందరం సంకల్పిద్దాం. అన్నారు. ఆయన చూపిన సమానత్వ మార్గంలో నడుస్తూ, సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయం, గౌరవం, అవకాశాలు అందేలా కృషి చేయడం మన బాధ్యత. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు సాకారం కావాలి అని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూణం శ్రవణ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే జయంతి కమిటీ నిర్వాహకులు సోమారపు ఐలయ్య, కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షులు సోమ రాజశేఖర్,పదో వార్డ్ కౌన్సిలర్ ముద్దసాని సురేష్, డాక్టర్ రామ్ నరసయ్య, ఎంఈఓ బుచ్చయ్య, కొత్తపల్లి రవి, చిట్టి మల్ల మహేష్, రాయిశెట్టి వెంకన్న, రాయిశెట్టి ఉపేందర్, యాకమల్లు మంగళపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply