ఎంపికైన వారికి రవీంద్ర భారతి లో నియమాక పత్రాలు అందజేత

నియామక పత్రాలు అందుకున్న అర్చకులు, పరిచారిక సభ్యులు సంతోషం

బాసర జూలై 17 ఆంధ్రప్రభ : రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయా ఆలయాలకు అర్చక, పరిచారిక, ఇతర పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం గతంలో భర్తీచేసింది. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆయా ఆలయాల ఈవో చేతుల మీదుగా ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేశారు. దీంతో నియామక పత్రాలు అందుకున్న అర్చకులు, పరిచారిక సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. గత 14 సంవత్సరాలుగా రాష్ట్ర దేవదాయ శాఖలో ప్రభుత్వం పోస్టులను భర్తీ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పోస్టులను భర్తీ చేయడంతో నియామక పత్రాలు అందుకున్న అర్చకులు పరిచారికలు ఇతర సిబ్బంది సంతోషం వ్యక్తం వెలిబుచ్చారు.

బాసరకు పది మంది నియామకం

ఇందులో భాగంగా బాసర ఆలయానికి ఒక అర్చక,ఒక శ్రీవిద్య పారాయణ దారు, రెండు వేద పండితు లు, నాలుగు పరిచారిక, ఒకటి డోలు విద్వాసుడు, ఒక వంట సహాయక
చార్య పోస్టులను ప్రభుత్వం నియమించింది.