సర్ సర్వే వంద శాతం పూర్తి చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలి
- ఖానాపూర్ అభివృద్ధి పనుల కోసం 20 కోట్లు నిధుల మంజూరు
- సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలి
- ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్
ఖానాపూర్, ఆంధ్రప్రభ : ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఖానాపూర్, పెంబి మండలాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు బూతు లెవల్ ఏజెంట్లు ఓటర్లకు అందుబాటులో ఉంటూ వంద శాతం పూర్తి చేయడానికి కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని జై కే ఫంక్షన్ హాల్ లో రెండు మండలాల కార్యకర్తలు, నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేయడంలో ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేస్తూ ఓటర్లకు సహకరించాలని సూచించారు. ఖానాపూర్, పెంబి మండలాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం రూ. 20 కోట్ల నిధులు మంజూరు చేశానని త్వరలో పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా నియోజకవర్గ రైతుల కోసం ఖానాపూర్ మండలంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం తన వంతు కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు. మండలంలో ని ఖానాపూర్ నుండి తర్లపాడు వరకు రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించి వాహనదారులు, ప్రయాణికులకు కష్టాలు తొలగించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఖానాపూర్ -బెల్లల్, రాజుర- మందపల్లి రోడ్లు సౌకర్యం మెరుగుపరచనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఏఎంసి చైర్మన్ భూషణ్, వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, కౌన్సిలర్లు రాజుర సత్యం, నిమ్మల రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, పి ఏ సి ఎస్ చైర్మన్ లు శ్రీనివాస్ రెడ్డి, అమంద శ్రీనివాస్, ఖానాపూర్ పట్టణ మండల అధ్యక్షులు గొర్రె గంగాధర్, జంగిలి శంకర్, ఖానాపూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజు నాయక్, ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, ఖానాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏఎంసి మాజీ చైర్మన్ కడర్ల గంగ నరసయ్య, నాయకులు దయానంద్, శంకర్, ఖానాపూర్,పెంబి మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
