allegations | మంత్రి తుమ్మల ఘాటు వ్యాఖ్యలు

allegations | మంత్రి తుమ్మల ఘాటు వ్యాఖ్యలు
2018లో రాజకీయంగా హరీశ్‌రావు పరిస్థితి ఏంటి..?
ఆ తర్వాత కొంతైనా మెరుగుపడిందా..
ఆరు గ్యారెంటీలపై హరీశ్ ఎప్పుడూ ఆవు కథ చెప్తుంటారు.
allegations | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హామీలు అమలు చేయలేదని హరీష్ రావు ఒకటే స్టీరియో రికార్డు పదే పదే వినిపిస్తున్నారని, ఆరోపణలతో బీఆర్‌ఎస్ నేతల బతుకు బజారుపాలవుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. పదవి పోయిన ఆందోళన, ఆక్రోశం బీఆర్‌ఎస్ నేతల్లో కనిపిస్తోందన్నారు. పార్టీలను విమర్శిస్తే మీ స్థాయి పెరగదని గుర్తుంచుకోవాలని భారాస శ్రేణులకు తుమ్మల సూచించారు. తాము అధికారంలో ఉండగా చేసిన అవినీతి వల్లే బీఆర్‌ఎస్ అస్థిత్వం, స్థానం, అధికారం పోయిందన్నారు. ఏ ముఖం పెట్టుకుని మళ్లీ అధికారంలోకి వస్తామని చెబుతున్నారని ప్రశ్నించిన తుమ్మల,, సీతారామ పథకం తనతో పాటు ఖమ్మం జిల్లా ప్రజల ఆకాంక్ష అన్నారు. తాను టీడీపీలో ఉన్నప్పుడే దుమ్ముగూడెం ప్రాజెక్టు డిజైన్ చేశారని గుర్తు చేశారు.
వైఎస్‌ఆర్ హయాంలో ఇందిరాసాగర్-రాజీవ్‌సాగర్ పనులు చేపట్టారని, వైఎస్‌ఆర్ మరణానంతరం ఇందిరాసాగర్-రాజీవ్‌సాగర్ పథకానికి తిలోదకాలు ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక తన ప్రధాన కోరిక సీతారామ ప్రాజెక్టు అని చెప్పానని, రాజీవ్‌సాగర్ డిజైన్‌తో బయ్యారం బ్యాలెన్స్‌డ్ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశామన్నారు. బయ్యారం డిజైన్ మార్చి ప్రాజెక్టు ఎత్తివేసి జూలురుపాడు మీదుగా సీతారామ చేపట్టారని, గత ప్రభుత్వ హయాంలో పంపులు, పైపుల కోసం కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. కేంద్ర అనుమతి లేకుండా ప్రాజెక్టుకు రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టారని, భారీగా ఖర్చు పెట్టినా ఎక్కడా ఒక్క ఎకరానికీ నీళ్లు రాలేదని దుయ్యబట్టారు.
