శాంతి భద్రతల సారథికి శుభాభినందనలు

శాంతి భద్రతల సారథికి శుభాభినందనలు

  • డీజీపీ సీ.వి. ఆనంద్‌ను కలిసిన ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
  • పుష్పగుచ్ఛం, శాలువా, జ్ఞాపికతో ఘన సన్మానం
  • ఫౌండేషన్ సేవలకు డీజీపీ ప్రశంస

రాయపర్తి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతల సారథిగా బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీ.వి. ఆనంద్‌కు ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి శుభాభినందనలు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీనివాస్ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం జ్ఞాపికను బహూకరించి ఆయన పదవీకాలంలో తెలంగాణ పోలీసు శాఖ మరింత పటిష్టంగా తయారై దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న డిజిపి సివి ఆనంద్ ఫౌండేషన్ సేవలను ప్రత్యేకంగా అభినందించారు. ప్రజా సేవలో ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని, సమాజ హితం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని శ్రీనివాస్ రెడ్డికి సూచించారు. పోలీసు శాఖ నుంచి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ భేటీలో పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు, ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.