విద్యుత్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం..
విద్యుత్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం..
కొత్తగూడ, ఆంధ్రప్రభ : విద్యుత్ షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం అయిన సంఘటన మండలంలోని ముష్మి గ్రామపంచాయతీ పరిధిలోని బోత్వానిగూడెంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోత్వానిగూడెం గ్రామానికి చెందిన కుంజా నర్సమ్మకు చెందిన ఇల్లు విద్యుత్ షాట్ సర్క్యూట్ తో పూర్తి స్థాయిలో కాలిపోయింది.
నిద్ర నుండి తెరుకున్న కుటుంబ సభ్యులు మంటను గమనించి హుటాహుటిన బయటకు వచ్చారు. ఎంత ప్రయత్నం చేసిన మంట అదుపులోకి రాలేదు. వంట సామాగ్రి, ఇండ్లలో ఉన్న అన్ని వస్తువులు కళ్ల ముందే బడిదకావడంతో కన్నీరుమున్నిరయ్యారు. భారీ మొత్తం నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
