గిరిజన అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతా..

గిరిజన అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతా..

నూతన ఐటీడీఏ పీవో మంద మకరంద

ఉట్నూర్, ఆంధ్రప్రభ : గిరిజనుల సమస్యల పరిష్కారం, గిరిజన అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని ఉట్నూర్ ఐటీడీఏ నూతన ప్రాజెక్టు అధికారి మంద మకరంద ఆన్నారు. ఆయన ఐటీడీఏ లో ని తన ఛాంబర్ లో బుధవారం డి పి ఆర్ ఓ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా ఐటీడీఏ నూతన పిఓ మంద మకరంద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాడని తన సొంత గ్రామం జగిత్యాల జిల్లా గంభీరావుపేట గ్రామము అని అన్నారు.

తాను స్థానికంగా అందుబాటులో ఉంటూ ఐటీడీఏ ద్వారా గిరిజనులకు మేలు జరిగేలా తగు ప్రణాళికలు సిద్ధం చేస్తామని అధికారుల అందరి సహకారంతో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తామని అన్నారు. ఐటీడీఏ ద్వారా గిరిజన అభివృద్ధి కోసం పలు విషయాలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తో పాటు స్పెషల్ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ తో కలిసి మాట్లాడడం జరిగిందని అన్నారు. ఐటీడీఏ లోని ప్రధాన శాఖల ద్వారా జరిగే కార్యక్రమాలు యధావిధిగా అమలు చేస్తామని ఒక సిస్టంతో పని చేస్తానని పిఓ అన్నారు.

గిరిజనులకు ఏ సమస్యలున్న తన దృష్టికి తేవాలని ఆదివాసి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఆదివాసీల స్థితిగతులు గ్రామాల్లో పరిస్థితులు మౌలిక వసతులు లాంటి సౌకర్యాలపై చర్చిస్తానని అన్నారు. అధికారులు ఉద్యోగులు సమయ వేల పాటించేలా విధులు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని పిఓ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో డి పి ఆర్ ఓ సంపత్ కుమార్, ఉట్నూర్ స్థానిక విలేకరులు పాల్గొన్నారు.

Leave a Reply