ఉట్నూర్‌లో ఉత్సాహంగా ఫ్రెండ్లీ క్రికెట్

ఉట్నూర్‌లో ఉత్సాహంగా ఫ్రెండ్లీ క్రికెట్
ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్ క్రీడా మైదానంలో గురువారం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ క్రీడల్లో ఉట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరంద అధికారులతో కలిసి పాల్గొని క్రికెట్ ఆడారు. బక్రీద్ సెలవు సందర్భంగా అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవో మంద మకరంద బ్యాటింగ్ చేసి ఫోర్లు కొట్టి అందరినీ అలరించారు.
క్రికెట్ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టుకు ఐటీడీఏ పీవో మంద మకరంద బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ, క్రీడలు ఆడడం, వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలని అన్నారు. అధికారులు, ఉద్యోగులు కలిసి సరదాగా క్రీడలు నిర్వహించడం ఉత్సాహాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
ఈ క్రీడల్లో ఉట్నూర్ ఐటీడీఏ ఏపీవో జనరల్ జాదవ్ వసంతరావు, డీడీ అంబాజీ జాదవ్, పీవీటీజీ ఏపీవో ఆత్రం భాస్కర్, జీసీసీ డీఎం గుడిమల్ల సందీప్ కుమార్, ఏజెన్సీ డిప్యూటీ విద్యాశాఖ అధికారి గోడం చందన్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
