ఎజన్సీల్లో బెల్ట్ షాపులు ఎత్తి వెయ్యాలి..
జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన జైనూర్, సిర్పూర్ (యు) మండలాల్లో నడుస్తున్న మద్యం బెల్ట్ షాపులను ఎత్తివేయాలని గ్రామీణ పేదల సంఘం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు కూటికల శంకర్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆయన శనివారం నాయకులతో కలిసి మాట్లాడుతూ.. ఈ ఎజన్సీ గ్రామాల్లో పుట్టగొడుగుల్ల వెలిసిన బెల్ట్ షాపులు నడుస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని అయన పేర్కొన్నారు.
ఎజన్సీల్లో మద్యం బెల్ట్ షాపులు నిలిపివేసి,వైన్స్ యజమానులపై బెల్ట్ షాప్ నిర్వహకులపై చర్యలు చేపట్టాలని అయన డిమాండ్ చేశారు.లేనిపక్షంలో కొమురం భీమ్ జిల్లా కలెక్టర్ కు కొమురం భీమ్ జిల్లా ఎక్సైజ్ అధికారికి, కమిషనర్ కు తక్షణమే ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు.ఇటివలరౌటసంకెపల్లి దత్తత గ్రామానికి మే 29న వచ్చిన గవర్నర్ కు ఎజన్సీ ప్రాంతాల్లో మద్యం బెల్ట్ షాపులు కట్టడి చేయాలని వినతి అందజేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.ఎజన్సీలపై చిన్న చూపు ఎందుకని ఆయన పేర్కొన్నారు.
