పాఠశాలలో నాగుపాము కలకలం
పాఠశాలలో నాగుపాము కలకలం
అచ్చంపేట, ఆంధ్రప్రభ: అచ్చంపేట మండలంలోని నడింపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నాగుపాము కలకలం రేపింది. పాఠశాల స్టోర్‌రూమ్‌లో నాగుపాము కనిపించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనలకు గురయ్యారు. ఉపాధ్యాయ బృందం వెంటనే స్పందించి స్నేక్ క్యాచర్ సుమన్‌కు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న ఆయన తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని నాగుపామును సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం పామును సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. సమయానికి స్పందించి ప్రమాదాన్ని నివారించిన సర్ప ప్రేమికుడు సుమన్‌ను అందరూ అభినందించారు.
