ఐక్యతే మహాబలం…

ఐక్యతే మహాబలం…
పాయకాపురం, ఆంధ్రప్రభ : అజిత్ సింగ్ నగర్ ఆంధ్ర ప్రభ కాలనీలో ది.ఆంధ్ర సిమెంట్ కంపెనీ ఎంప్లాయిస్ అండ్ ఇండస్ట్రియల్ వర్కర్స్ కో.ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మహాజనసభ సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రభ కాలనీలోని సంఘ కార్యాలయంలో జరిగిన సభలో 100 మందికి పైగా సభ్యులు హాజరయ్యారు.
ఈసభలో సంఘ సభ్యుల పూర్తి వివరాల నమోదుతో పాటుగా పలు విషయాలను చర్చించారు.ఐక్యతే మహాబలం అని సభలో వక్తలు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఇన్స్పెక్టర్, సంఘ స్పెషల్ ఆఫీసర్ వై అరుణ్ కుమార్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
