వీడీసీ అధ్యక్షుడిగా సుభాష్ గౌడ్…

వీడీసీ అధ్యక్షుడిగా సుభాష్ గౌడ్…

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన మల్యాల సుభాష్ గౌడ్ కమ్మర్ పల్లి నూతన గ్రామ అభివృద్ధి కమిటి అధ్యక్షుడి గా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.2026 — 2028 సంవత్సరం గాను నూతన గ్రామ కమిటీనీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో కమ్మర్ పల్లి నూతన గ్రామ అభివృద్ధి కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా మల్యాల సుభాష్ గౌడ్, ఉపాధ్యక్షులుగా సింగిరెడ్డి భరత్, క్యాషియర్ గా పన్నాల రవి, కార్యదర్శిగా పెంట కిషన్, సలహాదారులుగా ఈర్గల్ల మహేష్, కౌడ రాము, సిలివేరి భూమేశ్వర్, పసుపుల రమేష్, బైండ్ల సాయిలు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మల్యాల సుభాష్ గౌడ్ మాట్లాడుతూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానాన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply