లోపాలులేని ఓటరు జాబితా రూపకల్పనే ‘సర్’ లక్ష్యం

ఎమ్మెల్యే గద్దె రామమోహన్
18వ డివిజన్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పరిశీలన..
బీఎల్‌వోలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని పిలుపు

కృష్ణలంక, ఆంధ్రప్రభ : ఓటరు జాబితాలోని లోపాలను సరిదిద్ది అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. గురువారం 18వ డివిజన్ కరెంట్ ఆఫీస్ ప్రాంతంలో జరుగుతున్న సర్ ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఖచ్చితమైన ఓటరు జాబితా ద్వారానే ఎన్నికల్లో ప్రజాభిప్రాయం సక్రమంగా ప్రతిబింబిస్తుందని అన్నారు. ఇంటింటికీ వచ్చే బీఎల్‌వోలకు అవసరమైన వివరాలను అందించి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.