Archery| నెల‌రోజులు ఆర్చరీ క్యాంప్

Archery| నెల‌రోజులు ఆర్చరీ క్యాంప్

మహబూబాబాద్ (మానుకోట), ఆంధ్ర‌ప్ర‌భ : మహబూబాబాద్ (మానుకోట) పట్టణంలో నిర్వహించబడనున్న ఉచిత సమ్మర్ ఆర్చరీ కోచింగ్ క్యాంప్ నిర్వాహ‌కులు తెలిపారు. ఈ కోచింగ్ నెల రోజుల పాటు కొనసాగుతుంద‌ని, ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేక శిక్షణా సెషన్లు నిర్వహించబడుతుని తెలిపారు. తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్, ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్, వరంగల్ జిల్లా ఆర్చరీ అసోసియేషన్, సాదుల ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ క్యాంప్ నిర్వహించబడుతోంది. సమావేశంలో క్యాంప్ లక్ష్యాలు, శిక్షణ విధానం, విద్యార్థులకు లభించే అవకాశాలు మరియు నమోదు ప్రక్రియపై పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన వారు ఈ శిక్ష‌ణ‌ను ఉప‌యోగించుకోవాల‌ని కోరారు.

Leave a Reply