CM | రేపే కాంగ్రెస్ నిర్ణయం

CM | రేపే కాంగ్రెస్ నిర్ణయం
CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేరళం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలకంగా చర్చించినట్లు సమాచారం. సీఎం అభ్యర్థి ఎంపికతో పాటు పార్టీ భవిష్యత్ వ్యూహాలపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ … అందరి అభిప్రాయాలను తీసుకున్న అనంతరం రేపు అధికారిక ప్రకటన చేస్తామని తెలిపారు. సీఎం పదవికి పలువురు నేతల పేర్లు వినిపిస్తుండటంతో కేరళం కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పార్టీ అధిష్టానం సమన్వయంతో తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
