కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్నకు ఘన సన్మానం

కడెం, ఆంధ్రప్రభ : నూతనంగా కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడిగా ఎన్నికైన బొడ్డు గంగన్నకు ఆయన స్వగ్రామమైన నచ్చన్ ఎల్లాపూర్‌లో గ్రామస్తులు, కార్యకర్తలు, స్నేహితులు, యువకులు ఘన సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా బొడ్డు గంగన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు రాజేష్, ఉపసర్పంచ్ లక్ష్మి ఆనంద్, వార్డు సభ్యులు ఉదయ్, అంబాజీ, దేశాయి, బదుబాయ్ తుకారాం, వీడీసీ అధ్యక్షుడు నర్సయ్య, కార్యకర్తలు ప్రభాకర్, గంగాధర్, నారాయణ, పోషన్న, పాండు, ప్రవీణ్, స్పందన స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ శ్రీనివాస్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు వెంకటేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
