బీఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలింపు..
పాలకుర్తి, ఆంధ్రప్రభ : సింగరేణి బొగ్గు గని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరి శనివారం చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. పాదయాత్రలో పాల్గొనకుండా పాలకుర్తి మండలం బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని బసంత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓఆంఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సింగరేణి కార్మికులు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని, కార్మిక సంక్షేమాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల చర్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ బండి శ్రీనివాస్, అల్ట్రాటేక్ ఫ్యాక్టరీ పర్మినెంట్ కార్మిక సంఘం ప్రధానకార్యదర్శి మాదాసు శ్రీనివాస్, వర్క్స్ క్లబ్ సెక్రటరి దారం తిరుపతి రెడ్డి, నాయకులు మాదాసు సతీష్, అరవింద్, శ్రీధర్, పెద్దపల్లి నాగరాజు, లక్కాకుల శ్రీనివాస్ తదితరులను పోలీసులు బసంత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
