దరఖాస్తుల ఆహ్వానం..

  • కుట్టు మిషన్లు, ఈ-బైక్‌లు, ఈ-స్కూటీలు, మోటార్ బైక్‌లకు అవకాశం
  • జూలై 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
  • జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కుమారస్వామి

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి క్రిస్టియన్ మైనార్టీల ఆర్థిక స్వావలంబన కోసం వివిధ ఉపాధి యూనిట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఆదోడా కుమారస్వామి తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ కుట్టు మిషన్, చిన్న వ్యాపారం (పెట్టీ బిజినెస్), ఈ-బైక్, ఈ-స్కూటీ, మోటార్ బైక్‌ల కోసం అర్హులైన క్రిస్టియన్ మైనార్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

కుట్టు మిషన్, పెట్టీ బిజినెస్ పథకాలకు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు, ఈ-బైక్, ఈ-స్కూటీ, మోటార్ బైక్ పథకాలకు 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులని తెలిపారు. పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షల వరకు యూనిట్ వ్యయం ఉండనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుల నమోదుకు జూలై 3 నుంచి 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే, మరిన్ని వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయం, రూమ్ నంబర్ ఎస్-16, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని లేదా 6302523278 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కుమారస్వామి కోరారు. జిల్లాలోని అర్హులైన క్రిస్టియన్ మైనార్టీ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని వారు విజ్ఞప్తి చేశారు.