Bronze medal | ఉదయ్‌పూర్‌లో అశోక్‌కు కాంస్య పతకం

Bronze medal | ఉదయ్‌పూర్‌లో అశోక్‌కు కాంస్య పతకం

Bronze medal | పరకాల, ఆంధ్రప్రభ : ఉదయ్‌పూర్‌లో ఇటీవల నిర్వహించిన ఆల్ ఇండియా ఫైర్ సర్వీస్ కంట్రోల్ బోర్డు మీట్–2026లో 5 కిలోమీటర్ల పరుగుపందెం విభాగంలో పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన పోతరాజు అశోక్ కాంస్య పతకం సాధించారు. దేశవ్యాప్తంగా పాల్గొన్న ప్రతిభావంతుల మధ్య అశోక్ ఈ విజయాన్ని సాధించడం గర్వకారణమని గ్రామస్తులు తెలిపారు.

క్రమశిక్షణతో కూడిన నిరంతర సాధన వల్లే ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. ఈ ఘనత పట్ల నాగారం గ్రామ ప్రజలు, స్నేహితులు అశోక్‌కు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఆయన విజయం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.