Statue unveiling | ఘనంగా కొమురం భీమ్ విగ్రహవిష్కరణ

Statue unveiling | ఘనంగా కొమురం భీమ్ విగ్రహవిష్కరణ

Statue unveiling | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండలంలోని వడ్యాల్ గ్రామంలో బుధవారం కొమురం భీమ్ విగ్రహావిష్కరణ ఘనంగా జరిపారు. నాయక్ పోడ్ కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొమురం భీమ్ విగ్రహాన్ని సర్పంచి నరేష్, గ్రామానికి చెందిన హైదరాబాదులో నివాసం ఉంటున్న నల్ల వినయ్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా వారు పోరాట యోధుడి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేష్ రెడ్డి,లింగ గౌడ్, లక్ష్మణ్, నారా గౌడ్, సుదర్శన్, గ్రామస్తులు, నాయక్ పోడ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply