AP | రామాలయ పనులను పరిశీలించిన డిప్యూటీ స్పీకర్..
వివాదాస్పద.. పెదపేట రామాలయ ప్రదేశాన్ని పరిశీలించిన రఘురామ..
AP | ఆకివీడు, జూలై29(ఆంధ్రప్రభ) : గత కొద్ది నెలలుగా రాష్ట్ర మొత్తం సంచలనంగా మారిన పెదపేట రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రామభక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆకివీడు పెదపేట రామాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగడంతో సుప్రీం తీర్పు అనంతరం పనులు శరవేగంగా మొదలుపెట్టారు. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు బుధవారం రామాలయం నిర్మాణ పనులు పరిశీలన చేశారు.
పోలీసులు ముందస్తు చర్యలు..
గతంలో వివాదస్పద ప్రదేశం కావడంతో పోలీసులు ముందస్తుగా పెదపేట ప్రాంతంలో పికటింగులు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా,డ్రోన్ సహాయంతో పెదపేట ప్రాంతంలో నిఘా పెంచారు. సుమారు 40మంది పోలీసులు రంగంలోకి దించి ముందస్తు చర్యలు చేపట్టారు.పెదపేట ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా డీఎస్పీ రఘువీర్ విష్ణు నేత్రత్వంలో కట్టుదిట్టం చేశారు.
డిప్యూటీ స్పీకర్ రామాలయ నిర్మాణ పనులు పరిశీలన..
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రామాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. సుమారు 4అడుగులు ఎత్తు వరకు కాంక్రీట్ బెడ్డు ఏర్పాటు చేస్తామని సంబంధిత వ్యక్తులు రఘురామకృష్ణ రాజుకు వివరించారు. అనంతరం రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో విజయంతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు. అదేవిధంగా గన్నవరంలో శిఖరం మినహా మిగిలిన పనులన్నీ పూర్తయ్యాయన్నారు.
రానున్న నవంబర్,డిసెంబర్ కల్లా రామాలయం నిర్మాణం పూర్తి చేస్తామని, మంచి శుభ ముహూర్తాన రామాలయ ఆలయ ప్రతిష్టకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా నేడు ఈ జిల్లాకే పరిమితం కాకుండా తెలుగు రాష్ట్రాల్లో పెదపేట రామాలయం ప్రసిద్ధి ఎక్కడంతో రామాలయ దర్శనానికి నలుమూలల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, రోడ్ల నిర్మాణానికి త్వరలోనే శ్రీకారం చుడతామని తెలిపారు. ఆకివీడు పట్టణన్ని రామాలయ నిర్మాణం పూర్తయ్యేసరికి ఐదు కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు, ఇతరత్రా అభివృద్ధి పనులకు ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా పేర్కొన్నారు.
