తండ్రిని చంపాడనే కసితోనే మధు హత్య..

తండ్రిని చంపాడనే కసితోనే మధు హత్య..

  • హత్య కేసులో ఐదుగురు నిందితులు అరెస్ట్
  • కేసు వివరాలు వెల్లడించిన ఎస్పి నరసింహ

సూర్యాపేట ఆంధ్రప్రభ : తన తండ్రి మిద్దె రవీందర్ ను చంపాడనే చింతలపాటి మధును మిద్దె జీవన్ హత్య చేసాడని జిల్లా ఎస్పి నరసింహ వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా పోలీస్ కార్యాలయం లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను చెప్పారు. సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి చెందిన చింతలపాటి మధు భార్య మౌనిక తన భర్త కనిపించడం లేదని సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రాత్రి పిర్యాదు చేయగా వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

అదేరోజు రాత్రి యర్కారం గ్రామ శివారులో కల్వర్ట్ కింద గోనె సంచి మూట లో మధు మృతదేహాన్ని గుర్తించి హత్యాకేసు గా మార్చి 5 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేశామన్నారు. 24గంటల్లో ఆధారాలు సేకరించి హంతకులను గుర్తించి పాత కక్ష్యల నేపథ్యంలో హత్య చేసినట్లు గుర్తించామన్నారు. 2007 లో మిద్దె రవీందర్ హత్య కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడు కాగా మధు పై రవీందర్ కొడుకు మిద్దె జీవన్ హత్య కు పథకం పన్ని ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు గుర్తించమన్నారు.

ఏ1 మిద్దె జీవన్, ఏ4 మిద్దె ఆనంద్ లను సోమవారం ఉదయం టేకుమట్ల సమీపంలో పట్టుకొని విచారణ చేయగా సూర్యాపేట రూరల్ మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన చింత సైదులు, అర్వపల్లి మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన మేదరి ప్రసాద్ లతో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. వీరికి సైదులు భార్య భవాని కక్కిరేణి భరత్ చంద్ లు సంహరించారన్నారు. ఐదుగురు నిందితులను పట్టుకొని రిమాండ్ చేయగా భవాని పరారి లో ఉన్నట్లు చెప్పారు.


2021 నుండి ప్రయత్నం..

మధును చంపి తన కక్ష తీర్చుకోవాలని మిద్దె జీవన్ తనకు తమ్ముడు వరసైన మిద్దె ఆనంద్ కు చెప్పి మధు తో సన్నిహితంగా ఉన్న చింత సైదులు, మేదరి ప్రసాద్ లను స్నేహితులుగా చేసుకొని 2021 నుండి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎర్కారం నుండి సూర్యాపేటకు బైక్ వచ్చే క్రమంలో జనగాం క్రాస్ రోడ్డులో కారు తో గుద్ది చంపాలని, నిమ్మికల్ లో ఒక పంచాయతీ దగ్గర చంపాలని పథకం పన్ని విఫలమయ్యారు. మధును ఎలాగైనా చంపాలని తాళ్లగడ్డలో ఇల్లు కిరాయికి తీసుకోని మందు దావతులు చేస్తుండేవారు. ఈ క్రమంలో శుక్రవారం మధును దావత్ కు పిలిచి ఫూటు గా మద్యం తాపించారు. మత్తులో ఉన్న మధు పై మొదట సైదులు కత్తి తో వేటు వేయగా జీవన్ అదే కత్తి తో మొఖం బాగాన్ని నుజ్జు నుజ్జు నరికాడు. ఆతర్వాత గోనె సంచిలో మూట కట్టి యర్కారం శివారులో మృతదేహాన్ని పడేసి మధు బైక్ ను బాలెంల శివారులో వదిలి వెళ్లారు. కత్తి, మధు ఫోన్ ను అడివేంల సమీపంలో పడేసి పారిపోయారు.


త్వరితగతిన శిక్షలు పడేలా కృషి

హంతకులకు త్వరితగతిన శిక్షలు పడేలా కృషి చేస్తామని ఎస్పి నరసింహ చెప్పారు. చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడుతూ భౌతిక దాడులకు హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పమన్నారు గతంలో జరిగిన హత్యా కేసులలో నేరస్తులకు జీవిత ఖైదు శిక్షలు పడ్డాయని గుర్తు చేశారు నాణ్యమైన దర్యాప్తు చేస్తూ కేసులను వేగవంతంగా సాంకేతిక కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఆధారాలు సాక్ష్యాలు నమోదు చేసి కోర్టులకు పంపిస్తున్నామని పేర్కొన్నారు ఈ కేసులో బాగా పనిచేసే పర్యవేక్షణ చేసిన డిఎస్పి ప్రసన్నకుమార్, పట్టణ సీఐ వెంకటయ్య, రూరల్ సీఐ రాజశేఖర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్బిఐ రామారావు, ఎస్ఐలు ఏడుకొండలు, శివతేజ, మహేంద్ర నాథ్, బాలు నాయక్, సిబ్బందిని ఆయన అభినందించారు.

Leave a Reply