బీజేపీలో చేరిన బొందలకుంట సర్పంచ్
మక్తల్ , ఆంధ్రప్రభ ; మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే. అరుణమ్మ సమక్షంలో నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం బొందలకుంట(నర్సిరెడ్డిపల్లి) గ్రామ సర్పంచ్ డి .అశోక్ కుమార్ , ఉప సర్పంచ్ ,వార్డు సభ్యులు బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎంపీ అరుణమ్మ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
సర్పంచ్ గ్రామ అభివృద్ధి కోసం సిసి రోడ్లు,167వ జాతీయ రహదారి నుండి నర్సిరెడ్డి పల్లి గ్రామం వరకు బిటి రోడ్డుకోరగా ఎంపీ అరుణమ్మ స్పందించి అభివృద్ధికి పూర్తి సహకరిస్తానని తెలిపారు .ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి, నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జి. బలరాం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కర్ని స్వామి, మండల అధ్యక్షుడు ఎం .ప్రతాపరెడ్డి, మాజీ ఎంపిటిసి వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
