తండ్రిని చంపిన కొడుకు..

  • పెద్దపల్లి జిల్లాలో దారుణం..

ఓదెల, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకే బండరాయితో దాడి చేసి తండ్రిని హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మడక గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మ్యాక మాదయ్య అలియాస్ వేపచెట్టు మాదయ్య (70)పై ఆయన కుమారుడు బాపూరావు మంగళవారం సాయంత్రం బండరాయితో దాడి చేశాడు.

తీవ్ర గాయాలపాలైన మాదయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పొత్కపల్లి ఎస్సై సనత్ కుమార్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం భూ వివాదాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.