సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో అంబలి పంపిణీ

దండేపల్లి, ఆంధ్రప్రభ : సత్య సాయి 15వ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని దండేపల్లి మండలంలోని మేదరపేటలో శుక్రవారం సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో ప్రయాణికులకు అంబలి పంపిణీ చేశారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,గత 15 రోజులనుండి సత్యసాయిబాబా నగర కీర్తనలను ప్రతి నిత్యం నిర్వహిస్తున్నామని నగర కీర్తనలతో భక్తుల సందడి మొదలైంది ఆయన నామ స్మరణ చేసుకుంటే ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం అన్నారు.సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో సాయంత్రం భజన కీర్తనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, మేదరి పేట సత్యసాయి భజన మండలి సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదలను స్వీకరించారు.
