అంజన్న విగ్రహ ప్రతిష్టాపన విజయవంతం చేయండి.

అంజన్న విగ్రహ ప్రతిష్టాపన విజయవంతం చేయండి.

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో వెలిసిన శ్రీ వ్యాస రాయల మహర్షిచే ప్రతిష్టించిన ఆంజనేయస్వామి విగ్రహ పునఃప్రతిష్టాపన,ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన కరపత్రికలను సోమవారం ఆలయ సన్నిధిలో ఆలయ అర్చకులు నరసింహ చారి జోషి, కమిటీ అధ్యక్షులు దొరోళ్ళ కృష్ణయ్య తో పాటు గ్రామ పెద్దలు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొని విడుదల చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 7వ తేదీన గురువారం ఉదయం 8 గంటలకు గోపూజ,ధ్వజారోహణం,అంకురార్పణ, గణపతి పూజ,పుణ్య హావచనం మాతృకపూజ తోపాటు గణపతి నవగ్రహాది హోమం నిర్వహిస్తారని ఈనెల 8న శుక్రవారం సర్వతోభద్ర దేవతా వాహనం,ప్రధాన శుద్ధి, పంచగవ్యాధివాసము, జలాధివాసము, మహస్నపనము వీటితోపాటు 9న శనివారం ఉదయం 5:30 నిమిషములకు ప్రతిష్టాంగ ప్రాణ ప్రతిష్ట హోమము,ప్రాణసూక్త పారాయణ అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ పున ప్రతిష్టాపన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహా పూర్ణాహుతి మహా మంగళహారతి తదుపరి తీర్థ ప్రసాద వితరణ ఉంటుందని అనంతరం భక్తులకు చాకలి వెంకటప్ప ఆధ్వర్యంలో అన్న ప్రసాదం ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖులు అంబాత్రేయ క్షేత్ర పీఠాధిపతి ఆదిత్య పరా శ్రీ స్వామి, శ్రీ పంచమ సిద్ధి లింగ స్వామి వారు పశ్చిమాద్రి విరక్త మఠం నేరడుగోo, స్వామి శ్రీ శాంతనంద్ పురోహిత్ శక్తిపీఠం వ్యవస్థాపకులు నారాయణపేట, శ్రీ కొత్త శివానంద స్వామీజీ గారు తెలంగాణ ప్రాంత ధర్మాచార్య లు,ప్రతిష్ట కార్యక్రమాల నిర్వహణ విద్వాన్ రాఘవేంద్ర చర్య ధర్మ ప్రచార కార్యదర్శి, ఉడిపి పేజావర వార మఠం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ వారు హాజరవుతారని తెలిపారు.

కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు చాకలి వెంకటప్ప,గుడిసె రాజప్ప,ఆంజనేయులు గౌడ్, సుధాకర్ రెడ్డి,మహేష్ గౌడ్, కే వెంకటప్ప, తులసిదాస్, కాటం నరసింహులు గౌడ్, శ్రీనివాస్ రెడ్డితో పాటు కమిటీ సభ్యులు ఉప్పు ఆంజనేయులు, ఎం.అశోక్, గుయ్యలి నాగిరెడ్డి, సప్పటి ఆంజనేయులు, పొర్ల వెంకటేష్, వాకిటి శివకుమార్ గుడిసె శేఖర్, వెంకప్ప గౌడ్, కమ్మరి ఆంజనేయులు, రాజా గౌడ్, సప్పటి తిమ్మప్ప, గుయ్యలి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply