రక్తదాన శిబిరానికి పిలుపు..

రక్తదాన శిబిరానికి పిలుపు..

విజయవంతానికి సహకరించాలని విజ్ఞప్తి..

మోపిదేవి, ఆంధ్రప్రభ : స్వచ్ఛంద రక్తదాన శిబిరం విజయవంతానికి సహకరించాలని పీఏసీఎస్ చైర్మన్ యర్రంశెట్టి సుబ్బారావు కోరారు.

అవనిగడ్డ శాసనసభ్యులు, రాష్ట్ర అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ మంగళవారం మోపిదేవి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మోపిదేవి సబ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో, మచిలీపట్నంకు చెందిన డాక్టర్ పట్టాభి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నిర్వహణలో ఈ శిబిరం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావును ఆదివారం యర్రంశెట్టి సుబ్బారావు కలిశారు. రక్తదాన శిబిరానికి సంబంధించిన ఆహ్వాన కరపత్రాన్ని ఆయనకు అందజేశారు.

శిబిరం విజయవంతానికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.