మహానాడు హైబ్రిడ్ రూపంలో..

మహానాడు హైబ్రిడ్ రూపంలో..

కార్యకర్తల ఉత్సాహమే లక్ష్యం..

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : రాబోయే మే 27, 28 తేదీలలో అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో గల 12 క్లస్టర్లలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి పిలుపునిచ్చారు.

ఆదివారం అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇంధన కొరతను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ ఆదేశాల మేరకు ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నియోజకవర్గంలోని 12 క్లస్టర్లలో ఏర్పాటు చేసిన స్క్రీన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కలిసికట్టుగా పాల్గొని మహానాడును విజయవంతం చేయాలని కోరారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్షులు గురుమూర్తి స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.

పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహించేందుకు కార్యకర్తలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరు క్లస్టర్ స్థాయిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ మండల టిడిపి అధ్యక్షుడు యాసం చిట్టిబాబు, జిల్లా అధికార ప్రతినిధి రావి రత్నగిరి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply