Black Magic | సీఎం ఇంటి సమీపంలో క్షుద్ర పూజలు
Black Magic | సీఎం ఇంటి సమీపంలో క్షుద్ర పూజలు
క్షుద్ర పూజల ఘటనపై పోలీసుల దర్యాప్తు
Black Magic | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కర్ణాటక ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ నివాసం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించిన ఘటన కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది.
సీఎం నివాసం వెనుకవైపున ఉన్న జీబీఏ మైదానం సమీప రోడ్డుపై వృత్తాకార ముగ్గులు వేసి, కోడిని కోసి, నిమ్మకాయలు ఉంచి పూజలు నిర్వహించినట్లు సమాచారం. ఉదయం ఈ దృశ్యాలను గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోనే ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. క్షుద్ర పూజలు నిర్వహించిన వారి ఉద్దేశం ఏమిటనే దానిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అక్కడ లభ్యమైన ఆనవాళ్లను సేకరించి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తుతెలియని వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.
