ప్రతి ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనాలి
పోతుగంటి భరత్ ప్రసాద్
ప్రతి బూత్‌లో ఓటరు నమోదు ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలి
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రతి ఓటరు ఎస్ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
బుధవారం నాగర్‌కర్నూల్ పట్టణంలోని నాగనూలు, దేశ ఇటీక్యాల బూత్‌లను సందర్శించిన ఆయన, ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్ఏలు, బూత్ కార్యకర్తలతో మాట్లాడి కార్యక్రమం పురోగతి, ఓటరు వివరాల పరిశీలన, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు.
ప్రతి బూత్‌లో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాలని కార్యకర్తలకు సూచించారు. గ్రామాలు, వార్డుల్లో ప్రతి ఓటరును సంప్రదించి, ఓటరు నమోదు చేసుకున్నారా లేదా తెలుసుకోవాలని, నమోదు చేయని వారిని బూత్‌కు తీసుకువచ్చి నమోదు చేయించేలా కృషి చేయాలని అన్నారు. సమష్టి కృషితోనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
బూత్‌ల బలోపేతమే భారతీయ జనతా పార్టీ విజయానికి బలమైన పునాదిగా నిలుస్తుందని భరత్ ప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ప్రమోద్ కుమార్‌తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
