Vakiti Srihari | సంపూర్ణ సహకారం అందిస్తా..

Vakiti Srihari | సంపూర్ణ సహకారం అందిస్తా..

  • నాతో పని చేయించుకోండా.. అది మీ బాధ్యత..
  • తపస్ నేతలతో మంత్రి వాకిటి శ్రీహరి..

Vakiti Srihari మక్తల్, ఆంధ్రప్రభ : జిల్లాలో విద్యా వ్యవస్థ పటిష్టతకు పాటుపడతానని అందుకు నన్ను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని తపస్ నేతలతో, రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం సాయంత్రం మక్తల్ లో తపస్ జిల్లా శాఖ పక్షాన మంత్రికి డైరీ క్యాలెండర్ అందించి పూల మొక్కతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సమస్యల పై మంత్రికి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాఠశాలల్లో కావలసిన సౌకర్యాలు, ఉపాధ్యాయుల సమస్యల గురించి తన స్థాయిలో జరగాల్సిన పనులన్నీ పూర్తి చేస్తానని, ఎల్లవేళలా ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటానని తెలిపారు. తదనంతరం నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి షేర్ కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరసింహ, బి. రవీందర్, మక్తల్ మాగనూరు మండల నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులను శాలువాలతో మంత్రి సన్మానించారు. విద్యా ప్రగతికి ఇంకా మెరుగ్గా విధులు నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా నాయకులు నాగార్జున, వి.భీమ్ రెడ్డి, వెంకట్ రాములు, కె .వెంకట్ రాములు, శివశంకర్, మక్తల్ మండల అధ్యక్షులు నర్సింలు, గౌరవ అధ్యక్షులు ఆత్కూర్ నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాకేష్, మాగనూరు మండల అధ్యక్షులు బాబురెడ్డి, గౌరవ అధ్యక్షులు రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి సురేష్ లతో పాటు డి.వెంకట్ రాములు, కర్ణాకర్, రవీందర్ రెడ్డి, రామాంజనేయులు, జగదీష్, నర్సింలు, ప్రవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply