ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం
ప్రతి ఇంటికి ఐదు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: సర్పంచ్ దీప్తి రఘురాం గౌడ్
హన్వాడ, ఆంధ్రప్రభ: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్ద ధర్పల్లి గ్రామంలో బుధవారం సర్పంచ్ దీప్తి రఘురాం గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దీప్తి రఘురాం గౌడ్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఇంటికి ఐదు మొక్కలు పంపిణీ చేస్తున్నామని, వాటిని నాటి సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) యశోదమ్మ, తహసీల్దార్ రాములు, గ్రామ కార్యదర్శి, జీపీఓతో పాటు ఇతర అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
