BJP | తమిళనాడులో బీజేపీ ‘త్రీ-సిలిండర్’ ఫార్ములా..

BJP | తమిళనాడులో బీజేపీ ‘త్రీ-సిలిండర్’ ఫార్ములా..
BJP | మూడు సిలిండర్ల మంత్రం అంటే ఏమిటి?
అన్నామలై ఫ్యాక్టర్.. బీజేపీ దూకుడు
తమిళనాడు ప్రయోగం.. తెలంగాణపై ప్రభావం
కమలదళం కొత్త వ్యూహం ఏమిటి?
కాంగ్రెస్ గ్యారంటీలకు బీజేపీ కౌంటర్ ఎలా?
BJP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దక్షిణాది రాజకీయాలంటేనే ఒక ప్రత్యేకమైన శైలి. ప్రాంతీయ సెంటిమెంట్లు, సిద్ధాంతాలు బలంగా ఉంటాయి. ప్రస్తుతం తమిళనాడు రాజకీయ యవనికపై బీజేపీ కొత్తగా ప్రయోగిస్తున్న ‘మూడు సిలిండర్ల మంత్రం‘ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ప్రయోగం కేవలం తమిళ తంబీలకే పరిమితమా? అక్కడ ప్రాంతీయ పార్టీల హవాను దాటి బీజేపీకి అధికారం కట్టబెట్టగలదా? అదే జరిగితే, రాబోయే తెలంగాణ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములాను కమల దళం ప్రయోగిస్తుందా?
BJP | అసలేమిటీ మూడు సిలిండర్ల మంత్రం?
తమిళనాడులో పాగా వేయడానికి బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాత్మక పథకం మూడు సిలిండర్లు. ‘సనాతన ధర్మం‘ చుట్టూ జరుగుతున్న చర్చను తమకు అనుకూలంగా మలుచుకోవడం. ముఖ్యంగా ద్రవిడ సిద్ధాంతాలకు కౌంటర్‌గా హిందూత్వ కార్డును జాగ్రత్తగా అమలు చేయడం. ఇదే బీజేపీ జాతీయ వ్యూహంగా అభివర్ణిస్తారు రాజకీయ విశ్లేషకులు.
ఒక మాజీ ఐపీఎస్ అధికారిని రంగంలోకి దించి, యువతలో ‘క్లీన్ ఇమేజ్‘, ‘అగ్రెసివ్ పాలిటిక్స్‘ను ప్రోత్సహించడం ఇదొక అన్నామలై ఫ్యాక్టర్. కేంద్ర ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడం. ముఖ్యంగా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ వంటి వాటిని ప్రచార అస్త్రాలుగా వాడుకోవడం. బహుశా అందుకే దీనిని ‘సిలిండర్ మంత్రం‘ అని పిలుస్తున్నారేమో!
BJP | ప్రయోగం సక్సెస్ అయితే…
ఇక తమిళనాడు తర్వాతేంటి అనే విషయానికొస్తే, తెలంగాణపై దీని ప్రభావం ఎంత అనేది ప్రధాన చర్చ. తమిళనాడులో ఈ వ్యూహం ఫలితమిచ్చి, బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగితే.. ఖచ్చితంగా ఆ పార్టీ టార్గెట్ తెలంగాణే! ఎందుకంటే తెలంగాణలో కూడా మతపరమైన ధ్రువీకరణకు ఆస్కారం ఉన్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.
తమిళనాడులో అన్నామలై లాగే, తెలంగాణలో కూడా ఒక దూకుడున్న నాయకత్వంను బండి సంజయ్ కాలం నుండి ఇప్పటి వరకు బీజేపీ ప్రోత్సహిస్తోంది. తమిళనాడు ప్రయోగం సక్సెస్ అయితే, ఇక్కడ కూడా అదే ‘అగ్రెసివ్ క్యాంపెయిన్‘ను మరింత ఉధృతం చేస్తారు. ఇది బీజేపీ మార్కు లీడర్ షిప్ స్టైల్.
BJP | అదే కమలదళం కొత్త ఫార్ములా..
తమిళనాడులో ద్రవిడ వాదానికి వ్యతిరేకంగా పోరాడితే.. తెలంగాణలో ఆత్మగౌరవం, కుటుంబ పాలన అనే అంశాల చుట్టూ బీజేపీ తన వ్యూహాన్ని అల్లుతోంది.
ఒక్కోచోట ఒక్కోరకం సవాళ్లు, గెలుపు అవకాశాలు, వాస్తవాలు తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ ‘గ్యారంటీ‘లకు బీజేపీ కౌంటర్ ఇవ్వగలదా? తమిళనాడులో బీజేపీ ప్రయోగం సక్సెస్ అయితే.. ఇక్కడ రేవంత్ రెడ్డి ‘ఆరు గ్యారంటీ‘ల వ్యూహాన్ని ఎదుర్కోవడానికి కమలదళం అదే ఫార్ములాను వాడే అవకాశం ఉంది.
BJP | పోటాపోటీ సంక్షేమం..
కాంగ్రెస్ ఇస్తున్న గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలకు కౌంటర్‌గా.. కేంద్రం నుంచి నేరుగా అందే పథకాల మీద బీజేపీ ఫోకస్ పెంచవచ్చు. అన్నామలై మాదిరిగానే, రేవంత్ రెడ్డి దూకుడును అడ్డుకోగలిగే ‘మాస్ అండ్ అగ్రెసివ్‘ లైన్ లోనే బీజేపీ తన రాష్ట్ర నాయకత్వాన్ని నడిపించే ఛాన్స్ ఉంది.
ఏది ఏమైనా, దక్షిణాదిలో పాగా వేయడానికి బీజేపీకి తమిళనాడు ఒక ‘ల్యాబొరేటరీ‘ లాంటిది. అక్కడ గెలిచినా, లేదా కనీసం ఓట్ల శాతం పెంచుకున్నా.. ఆ ఉత్సాహంతో తెలంగాణలో సరికొత్త ప్రయోగాలు చేయడం ఖాయం. ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ‘మూడు సిలిండర్ల మంత్రం‘ రాబోయే తెలంగాణ గడ్డపై ఎంతవరకు పేలుతుందో చూడాలి.
