TG | కొత్త పేరు వెలుగులోకి…

TG | కొత్త పేరు వెలుగులోకి…
TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మొయినాబాద్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కొత్త వ్యక్తి పేరు బయటపడటంతో విచారణ మరింత కీలకంగా మారింది.
తెలంగాణ రాష్ట్రంలోని మొయినాబాద్ డ్రగ్స్ కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కేసులో కొత్త పేరు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.
గతేడాది డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో దుబాయ్‌లో మృతిచెందిన కేదార్‌తో రోహిత్‌రెడ్డి సోదరులకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు కస్టడీ రిక్వెస్ట్ కాపీలో వెల్లడించారు. కేదార్‌కు రోహిత్‌రెడ్డి మధ్య అనేక ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. రోహిత్, రితేష్ బ్యాంక్ ఖాతాల నుంచి కేదార్‌కు సుమారు రూ.25 లక్షల మేర ట్రాన్సాక్షన్లు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ పరిణామాలతో కేసు దర్యాప్తు మరింత కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
