కారు బోల్తా.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

కారు బోల్తా.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు

టేకుమట్ల, మే 23 (ఆంధ్రప్రభ): టేకుమట్ల మండల కేంద్రంలోని రాఘవపూర్ శివారులో కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది.

స్థానికుల వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల నుంచి గిద్దెముత్తారం వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది.

ఈ ప్రమాద సమయంలో కారులో మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన రాచమల్ల చంద్రారెడ్డితో పాటు మరో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్‌బ్యాగ్‌లు (బెలూన్స్) ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది మహేందర్, వెంకటేశ్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో స్పందించి మానవత్వం చాటుకున్న పోలీసులను స్థానికులు అభినందించారు.