అంగన్ వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కృషి

నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సామెల్

మోత్కూర్, ఆంధ్రప్రభ : అంగన్ వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. శనివారం మండలంలోని దత్తప్పగూడెం లో నూతనంగా నిర్మించిన అంగన్ వాడీ భవనాన్ని ఎమ్మెల్యే సామెల్ స్వయంగా ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం లో సీఎం రేవంత్ రెడ్డి అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారుల హాజరు శాతం పెంచేందుకు పౌష్టికాహారం తో పాటు ఉదయం వేళ అల్పాహారం సైతం ప్రవేశపెడుతున్నారన్నారు.అంగన్ వాడీ కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించాలని సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు.

ఈ సందర్భంగా ప్రీ స్కూల్ పిల్లలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా యూనిఫామ్స్ పంపిణీ చేశారు. సర్పంచ్ గుండు యాదగిరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డి డబ్ల్యూ ఓ నర్సింహా రావ్,మార్కెట్ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు, సి డి పి ఓ నాజీ, సూపర్ వైజర్ జ్యోతి, సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ ఇటికాల ఎల్లమ్మ,పి ఆర్ ఏ ఈ శివ,పంచాయతీ కార్యదర్శి, పాలడుగు సర్పంచ్ అంతటి భగవంతు,ఏ పి ఐ డి సి మాజీ డైరెక్టర్ కంచర్ల యాదగిరి రెడ్డి ,వార్డ్ సభ్యులు,ఇంచార్జ్ టీచర్ బి స్వప్న తదితరులు పాల్గొన్నారు.