విద్యార్థులకు పూర్వ విద్యార్థుల చేయూత
విద్యార్థులకు పూర్వ విద్యార్థుల చేయూత
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం కోనసముందర్ గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన 2014 – 2015 బ్యాచ్‌కు చెందిన రుద్ర సేన యూత్ పూర్వ విద్యార్థులు పరీక్షలకు అవసరమైన ప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్లు, పదో తరగతి పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను సోమవారం పంపిణీ చేశారు.విద్యార్థులు పరీక్షలకు ధైర్యంగా, సిద్ధమై మంచి ఫలితాలు సాధించాలని వారు తెలిపారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బెజ్జారం రాకేష్ ముఖ్య అతిథిగా హాజరై పూర్వ విద్యార్థుల సేవలను అభినందించారు. జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుపాల్ మాట్లాడుతూ,పూర్వ విద్యార్థులు ముందుకొచ్చి విద్యార్థులకు పరీక్షల సమయంలో అవసరమైన సామగ్రిని అందించడం ఎంతో అభినందనీయమని తెలిపారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు పరీక్షలను ధైర్యంగా, నిబద్ధతతో రాసి మంచి ఫలితాలు సాధించాలని కోన సముందర్ గ్రామానికి మంచి పేరు తేవాలని, రుద్ర సేన యూత్ పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ దుర్శనం సందీప్, గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బట్టల హేమంత్, దుర్శనం కిరణ్, అరుణ్, మారుతి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
